బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 13
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, గ్రామ గ్రామాన ఉత్సవాలు జరుపుకోవాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ డిమాండ్ చేశారు. ఆదివారం లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
*తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి* *గ్రామ గ్రామాన ఉత్సవాలు జరుపుకోవాలి* *ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్* తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా చేపట్టాలని *ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్* డిమాండ్ చేశారు. ఆదివారం లోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్వాతంత్రం వచ్చిన సంవత్సరం తర్వాతనిజాం పాలన నుండి విముక్తి లభించిందని,, ప్రభుత్వం అధికారికంగా ఉత్సవాలు నిర్వహించకపోవడం సరియైనది కాదన్నారు. న అన్ని జిల్లా కేంద్రాల్లో ఉత్సవాలు నిర్వహించాలని, సర్దార్ వల్లభాయ్ పటేల్ ను స్మరించు కోవాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ విమోచనం పట్ల చిత్త శుద్ధిలేదన్నారు. 17వ తేదీన బిజెపి ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన జాతీయ జెండాలు ఎగరవేస్తామన్నారు. మహారాష్ట్ర కర్ణాటక ప్రభుత్వాలు విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికీb ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వర్గం మెప్పుకోసం అధికారికంగా చేపట్టకపోవడం శోచనీయమన్నారు. సమావేశంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నా రెడ్డి, సీనియర్ నాయకులు సాంవ్లీ రమేష్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు రమేష్, మండల బిజెపి అధ్యక్షురాలు దేగాం సర్పంచ్ సిరం సుష్మరెడ్డి తదితరులున్నారు.












