Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 13
నిర్మల్ నియోజకవర్గ రైతుల సాగునీటి సమస్య పరిష్కారంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావు చేసిన ప్రత్యేక కృషి ఫలించింది. ఆయన విజ్ఞప్తి మేరకు ఎస్ఆర్ఎస్పీ సరస్వతి కెనాల్‌కు వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేశారు.
*శ్రీహరి రావు కృషి ఫలించింది.. సరస్వతి కాలువకు నీటి విడుదల!* *ఆయకట్టు రైతులకు ఊరట.. సోన్, లక్ష్మణ్చందా, మామడ మండలాలతో పాటు ఖానాపూర్ వరకు సాగునీరు* నిర్మల్: నిర్మల్ నియోజకవర్గ రైతుల సాగునీటి సమస్య పరిష్కారంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావు చేసిన ప్రత్యేక కృషి ఫలించింది. రైతుల ఇబ్బందులను టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సరస్వతి కాలువకు నీటిని విడుదల చేయాలని శ్రీహరి రావు గారు విజ్ఞప్తి చేశారు. ఆయన ప్రత్యేక కృషితో ఎస్ఆర్ఎస్పీ సరస్వతి కెనాల్‌కు వారబందీ పద్ధతిలో ఈరోజు నీటిని విడుదల చేశారు. దీంతో సోన్, లక్ష్మణ్చందా, మామడ మండలాల పరిధిలోని సరస్వతి కాలువ ఆయకట్టు పంట పొలాలకు సాగునీరు అందడంతో పాటు ఖానాపూర్ వరకు కూడా సాగునీరు అందుతోంది. నీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు కాలువలో నీటి విడుదలతో ఊరట లభించింది.












