కుబీర్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 12
మండలంలోని డోడర్నా గ్రామంలో రైతు నమోదు కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. రైతు నమోదు ప్రక్రియ ఆవశ్యకతను ఆయన వివరించారు.
రైతు నమోదుపై అవగాహన ( మండలంలోని డోడర్నా గ్రామంలో రైతు నమోదు కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) ప్రవీణ్ కుమార్ రైతులకు రైతు నమోదు చేసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. ప్రతి రైతు తప్పనిసరిగా రైతు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని, ప్రభుత్వం అందించే వివిధ వ్యవసాయ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఈ నమోదు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏఈఓ ప్రవీణ్ కుమార్ కోరారు.











