నిర్మల్ నియోజకవర్గ రైతుల సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావు చేసిన విజ్ఞప్తి మేరకు, సరస్వతి కాలువకు నీటిని విడుదల చేసేందుకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నెల 13వ తేదీ ఆదివారం నుండి వార బంధి పద్ధతిలో నీటిని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
కూచాడి శ్రీహరి రావు విజ్ఞప్తి.. సరస్వతి కాలువకు నీటి విడుదలకు గ్రీన్ సిగ్నల్! నిర్మల్ నియోజకవర్గ రైతుల సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావు నిన్న నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసి, సరస్వతి కాలువ పరివాహక ప్రాంతంలో ఉన్న రైతుల పరిస్థితిని వివరించారు. అనంతరం ఇరిగేషన్ శాఖ ENC రమేష్ బాబు గారిని కలిసి సరస్వతి కాలువ పరివాహక ప్రాంతంలోని పరిస్థితులను, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. స్పందించిన మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ నెల 13వ తేదీ ఆదివారం నుండి వార బంది పద్ధతిలో సరస్వతి కాలువకు నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ ENC రమేష్ బాబు గారికి సూచించారు. నీటి లభ్యత తక్కువగా ఉన్నందున రైతులు నీటిని వృథా చేయకుండా సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. రైతుల సమస్యపై స్పందించి నీటి విడుదలకు చర్యలు చేపట్టిన మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఇరిగేషన్ ENC రమేష్ బాబు గారికి కూచాడి శ్రీహరి రావు కృతజ్ఞతలు తెలిపారు.












