మెరుగుపరచాలి (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 11
నిర్మల్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రోగులకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని మెరుగుపరచా జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా నిర్మల్ జిల్లా మనో రంజని తెలుగు టైమ్స్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో వైద్యాధికారులు, వివిధ విభాగాల అధిపతులతో కలెక్టర్ సమావేశమై ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై సమీక్షించారు. రోజువారీగా నమోదవుతున్న ఓపీ వివరాలతో పాటు వివిధ విభాగాల్లో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆర్థోపెడిక్, కార్డియాలజీ, రేడియాలజీ, ఈఎన్టీ తదితర విభాగాల్లో వైద్య సేవల మెరుగుదలకు అవసరమైన పరికరాలు, శస్త్రచికిత్సలకు అవసరమైన యంత్రాల వివరాలను ఆయా విభాగాల అధిపతుల నుంచి సేకరించారు. అవసరమైన పరికరాలను ప్రాధాన్యత క్రమంలో సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు సౌకర్యవంతంగా వైద్య సేవలు అందేలా అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. సదుపాయాలు మెరుగుపడితే మరింత మంది రోగులకు ఆసుపత్రిలోనే మెరుగైన చికిత్స అందించే అవకాశం ఉంటుందని అన్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పార్కింగ్ స్థలాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సమావేశంలో ఆసుపత్రి పర్యవేక్షకులు గోపాల్ సింగ్, అధికారులు రమేష్, సరోజ, వైద్యులు, అధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.












