కామారెడ్డి, 10 September
ప్రభుత్వాసుపత్రి పోలీస్ అవుట్‌పోస్ట్ పరిధిలో కొత్త సీసీ కెమెరాలను గురువారం ఏర్పాటు చేశారు. ఆసుపత్రి పార్కింగ్ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను పర్యవేక్షించేలా ఈ కెమెరాలను అమర్చారు. వీటి నియంత్రణ వ్యవస్థను పోలీస్ అవుట్‌పోస్ట్‌లో ఏర్పాటు చేశారు.
ప్రభుత్వాసుపత్రిలో సీసీ కెమెరాలు : ప్రభుత్వాసుపత్రి పోలీస్ అవుట్‌పోస్ట్ పరిధిలో నూతన సీసీ కెమెరాలను గురువారం ఏర్పాటు చేశారు. ఆసుపత్రి పార్కింగ్ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను పర్యవేక్షించేలా కెమెరాలను అమర్చారు. వీటి నియంత్రణ వ్యవస్థను పోలీస్ అవుట్‌పోస్ట్‌లో ఏర్పాటు చేశారు. నూతన కెమెరాల వ్యవస్థను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆసుపత్రి పరిసరాల్లో భద్రతను పటిష్ఠం చేయడంతోపాటు పార్కింగ్ ప్రాంతంలో నిఘా పెంచేందుకు ఈ కెమెరాలు ఉపయోగపడనున్నాయి. కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ సంతోష్, డాక్టర్ భరద్వాజ్, ఇతర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.












