భువనగిరి, 10 September
కాలం ఆగిపోతే, ప్రకృతి మౌనమైపోతే ఈ లోకం ఒక్క క్షణం ఊపిరి పీల్చుకుంటుందా అని, నిన్నటి జ్ఞాపకాలు నేటి గడప దాటి వస్తాయా అని, చేతుల నుంచి జారిపోతున్న ప్రాణం మళ్లీ ఊపిరి పీల్చుకుంటుందా అని రచయిత్రి మంజుల పత్తిపాటి ప్రశ్నించారు. డబ్బు కోసం పరుగెత్తిన మనిషి అదే డబ్బుతో కాలాన్ని కొనగలడా అని ఆమె అన్నారు.
టైం ఆగిపోతే… డబ్బుతో కాలాన్ని కొనగలమా..? — మంజుల పత్తిపాటి టైం ఆగిపోతే… ప్రకృతి మౌనమైపోతే… పరుగులు తీసే ఈ లోకం ఒక్క క్షణం ఊపిరి పీల్చుకుంటుందా..? నిన్నటి జ్ఞాపకాలు నేటి గడప దాటి వస్తాయా? చేతుల నుంచి జారిపోతున్న ప్రాణం మళ్లీ ఊపిరి పీల్చుకుంటుందా..? డబ్బు కోసం పరుగెత్తిన మనిషి అదే డబ్బుతో కాలాన్ని కొనగలడా..? ధనదాహంతో పచ్చదనాన్ని నాశనం చేసి కాంక్రీట్ అడవుల్లో, బహుళ అంతస్తుల భవనాల్లో నివసిస్తున్న బడాబాబులు… అదే డబ్బుతో కాలాన్ని కొనగలరా..? కానీ ఆ రోజు ఎప్పటికీ రాకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉంది..! ఓ మనిషీ… నిజంగానే టైం ఆగిపోతే… నీవు సంపాదించుకున్న సొమ్మంతా గంగపాలు అవుతుంది..! కనుక… సంపాదించుకున్న సొమ్ములో కొంత ప్రకృతి కోసం ఖర్చు పెట్టు..! ప్రకృతిని కాపాడు… మనిషితనాన్ని నిలబెట్టు..! రచన: మంజుల పత్తిపాటి ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదాద్రి జిల్లా, తెలంగాణ.











