బీఆర్ఎస్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 09
తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని, ప్రజాకవి శ్రీ కాళోజీ నారాయణరావు 112వ జయంతి వేడుకలను పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఎల్లమ్మగుట్టలోని జిల్లా కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, మాజీ జడ్పీ చైర్మన్, రాష్ట్ర కార్యదర్శి దాదన్నగారి విఠల్‌రావు జిల్లా ముఖ్య నాయకులతో కలిసి కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కాళోజీకి ఘన నివాళి మనోరంజని తెలుగు టైమ్స్ ' తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజాకవి శ్రీ కాళోజీ నారాయణరావు 112వ జయంతి వేడుకలను పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఎల్లమ్మగుట్టలోని జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్, రాష్ట్ర కార్యదర్శి దాదన్నగారి విఠల్‌రావు జిల్లా ముఖ్య నాయకులతో కలిసి కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కాళోజీ నారాయణరావు తెలుగు భాష, సాహిత్యానికి చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. కార్యక్రమంలో మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, నగర అధ్యక్షుడు సిర్ప రాజు, కే. పెద్ద శ్రీనివాస్‌రావు, ముత్యం, ఉమాపతిరావు, శ్రీనివాస్‌రావు, జమాల్పూర్ రమేష్, లింగం, అగ్గు సంతోష్, చింతకాయల రాజు, విజయ్‌కుమార్, విఘ్నేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.











