తానూర్, 13 September
భోసి గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రతిష్టించే శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్సవ కమిటీ సభ్యుల వివరాల ప్రకారం, ఈ నెల 14 నుంచి 19 వరకు వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
భోసి శ్రీ వరసిద్ధి కర్ర వినాయక మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి బైంసా మనోరంజని తెలుగు టైమ్స్ భోసి గ్రామములో గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రతిష్టించే శ్రీ వరసిద్ధి కర్ర వినాయక మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.14న శ్రీ వరసిద్ధి వినాయక ప్రతిష్టాపన, 15న సంగీత విభావరి,16 రంగస్థల కార్యక్రమము,17న ఆధ్యాత్మిక చింతన, 18న సాంస్కృతిక కార్యక్రమాలు, 19న రంగస్థల కార్యక్రమాలు, వంటి కార్యక్రమాలు ప్రతిరోజు జరపటానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రము హారతి , ధూప దీప నైవేద్యాల ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయనట్లు వారు తెలిపారు. దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగు ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు భక్తులకు అన్నదాన ప్రసాదం చేయనట్లు తెలిపారు. ముదోల్ నియోజకవర్గంలోని ఈ గ్రామంలో అత్యధిక ప్రభుత్వ ఉద్యోగులు ఉండటానికి శ్రీ వరసిద్ధి వినాయకుడే అనుగ్రహం చూపినట్లు వారు భావిస్తారు. అలాగే భక్తులు కూడా ఇలాగే భావించి తమ బిడ్డలకు మేలు జరగాలని కోరుతూ ముడుపులు కట్టి, భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. కోరిన వరాలను శ్రీ వరసిద్ధి వినాయకుడు ఇవ్వడం వలన అందరూ శ్రీ వరసిద్ధి వినాయకుడు అని కొనియాడుతారు. గత 64 సంవత్సరాలుగా ఈ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.












