నిర్మల్, 13 September
వినాయక చవితి పర్వదినాన్ని జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి కృపతో ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.
జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి పర్వదినాన్ని జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి కృపతో ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, పరస్పర సహకారం, ఐకమత్యంతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ కోరారు. ఉత్సవ నిర్వాహకులు, ప్రజలు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని సూచించారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి, పర్యావరణహిత నిమజ్జనానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. విద్యుత్, అగ్నిప్రమాదాలు, ఇతర అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.నిమజ్జన కార్యక్రమాలను అధికారుల సూచనల మేరకు నిర్దేశిత ప్రదేశాల్లోనే సురక్షితంగా నిర్వహించాలని, ప్రజలు సంయమనం పాటిస్తూ వినాయక ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కోరారు.












