దూదిగాం, దూదిగాం, నాగర్‌కర్నూల్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 13
దూదిగాం గ్రామానికి చెందిన రచ్చ శ్రీనివాస్, సంధ్య దంపతుల కుమారుడు రచ్చ ప్రవీణ్ కుమార్ ఎంబీబీఎస్‌లో ఉచిత సీటు సాధించారు. మొదటి కౌన్సెలింగ్‌లో నాగర్‌కర్నూల్ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు లభించిందని ఆయన తెలిపారు.
ఎంబీబీఎస్‌లో సీటు సాధించిన రచ్చ ప్రవీణ్ కుమార్ ( ** దూదిగాం గ్రామానికి చెందిన రచ్చ శ్రీనివాస్, సంధ్య దంపతుల కుమారుడు రచ్చ ప్రవీణ్ కుమార్ ఎంబీబీఎస్‌లో ఉచిత సీటు సాధించారు. మొదటి కౌన్సెలింగ్‌లో నాగర్‌కర్నూల్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు లభించినట్లు ఆయన తెలిపారు.చిన్ననాటి నుంచి విద్యలో ప్రతిభ కనబరుస్తూ వచ్చిన ప్రవీణ్ కుమార్.. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చుతూ వైద్య విద్యలో అడుగుపెట్టారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడమే తన లక్ష్యమని తెలిపారు. తనకు చిన్ననాటి నుంచి విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు రుణపడి ఉంటానని, వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఘనంగా సన్మానం పోచంపాడు గురుకుల బాలుర పాఠశాల ఉపాధ్యాయ బృందం రచ్చ ప్రవీణ్ కుమార్‌ను ఘనంగా సన్మానించింది. కళాశాల ప్రిన్సిపల్ వి. మహిపాల్ రెడ్డి శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్‌ను ఆదర్శంగా తీసుకొని బైపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కష్టపడి చదివి తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ఏటీపీ అశ్విని, ఫిజికల్ డైరెక్టర్ సీహెచ్ సంజీవ్, డిప్యూటీ వార్డెన్ సంతోష్ కుమార్, ఉపాధ్యాయ బృందం, ఇంటర్ బైపీసీ విద్యార్థులు పాల్గొన్నారు.












