డెంకడ, 12 September
మండలం సోమార్పేట్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కొడారి రాజన్న ఇటీవల మృతిచెందారు. ఆయన కుటుంబ సభ్యులను శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించి, రాజన్న చిత్రపటానికి నివాళులర్పించారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు.... మనోరంజని తెలుగు టైమ్స్ మండలం సోమార్పేట్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కొడారి రాజన్న ఇటీవల మృతిచెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు జంగిలి శంకర్‌తో పాటు పలువురు నాయకులు శనివారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం రాజన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డిసిసి కార్యదర్శి అంకం రాజేందర్ సర్పంచుల మండల ఫోరం అధ్యక్షులు రాజు నాయక్ తర్లపడ్ సర్పంచ్ పొలంపెల్లి సచిన్, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు బిక్కు నాయక్ ప్రధాన కార్యదర్శి కొడిమ్యాల వీరేష్ ఉప సర్పంచ్ సార్ల నరసయ్య పిఎసిఎస్ డైరెక్టర్ గాజుల గంగన్న గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు












