మురికివాడలకు అడ్డు తెరలు బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ప్రపంచ నేతల కంటపడకుండా ఏర్పాట్లు బీజేపీ ప్రభుత్వ వైఖరిపై ప్రతిపక్షాల విమర్శలు పేదరికాన్ని దాచే పాలన ఎందుకు అని ప్రశ్న న్యూ దేశ రాజధాని లోని మురికివాడలను ప్రపంచ నేతల కంటపడకుండా తెరలతో కప్పివేయడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో అంతర్జాతీయ అతిథులు ప్రయాణించే మార్గాల్లో పేదల నివాస ప్రాంతాలు కనిపించకుండా తెరలు ఏర్పాటు చేశారని ఆరోపించాయి. నగరాన్ని అందంగా చూపించేందుకు పేదల జీవన పరిస్థితులను దాచడం అభివృద్ధి కాదని పేర్కొన్నాయి. అభివృద్ధి అంటే దాచడమా పేదలు నివసించే ప్రాంతాల్లో సరైన గృహాలు, తాగునీరు, పారిశుధ్యం, మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన ప్రభుత్వం.. ప్రపంచ నేతలు వస్తున్న సమయంలో ఆ ప్రాంతాలను తెరల వెనుక దాచడమేంటని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. పేదరికాన్ని కప్పిపుచ్చినంత మాత్రాన అది తొలగిపోదని సీపీఐ(ఎం), కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు పేర్కొన్నారు. మురికివాడలను తెరలతో కప్పివేయడం పేదల పట్ల ప్రభుత్వ వైఖరికి నిదర్శనమని సీపీఐ(ఎం) విమర్శించింది. పేదల సమస్యలను పరిష్కరించకుండా వారి నివాసాలను ప్రపంచానికి కనిపించకుండా చేయడం ద్వారా దేశ ప్రతిష్ఠ పెరగదని పేర్కొంది. గృహాలు, తాగునీరు, పారిశుధ్యం, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేసింది. తెరల మాటున పేదల జీవితం బీజేపీ ప్రభుత్వానికి పేదల సమస్యల పరిష్కారం కంటే వాటిని ప్రపంచం కంటపడకుండా చేయడంపైనే శ్రద్ధ ఉందని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా విమర్శించారు. ప్రజల వాస్తవ పరిస్థితులను దాచడం సిగ్గుచేటని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్ఠను పెంచాలంటే పేదల సమస్యలను పరిష్కరించాలి తప్ప.. వారిని తెరల వెనుక దాచకూడదని స్పష్టం చేసింది. ఆంక్షలతో సామాన్యులకు ఇక్కట్లు బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో వీవీఐపీల రాకపోకల కోసం లో పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 35 రహదారులపై దాదాపు 24 గంటల పాటు ఆంక్షలు కొనసాగగా, 22 ప్రాంతాల్లో వాహనాల మళ్లింపులు చేపట్టారు. దీంతో న్యూ , సెంట్రల్ జిల్లాల్లో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆటోలు, ఈ-రిక్షాలు, డెలివరీ సిబ్బంది, రోజువారీ కూలీల ఉపాధిపై ఆంక్షల ప్రభావం పడిందని పలువురు తెలిపారు. 19 ఏళ్ల గిగ్ వర్కర్ పవన్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ ఆంక్షల కారణంగా రెండు రోజుల ఆదాయం కోల్పోయానని పేర్కొన్నారు. ఆటో, ఈ-రిక్షా డ్రైవర్లు కూడా ఉపాధి కోల్పోయామని వాపోయారు.
మురికివాడలకు అడ్డు తెరలు
Share:

సారాంశం
ప్రపంచ నేతల కంటపడకుండా పేదల నివాసాలను దాచడం అభివృద్ధి కాదని విమర్శ
ముఖ్య విషయాలు
- బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో అంతర్జాతీయ అతిథులు ప్రయాణించే మార్గాల్లో పేదల నివాస ప్రాంతాలు కనిపించకుండా తెరలు ఏర్పాటు చేశారని ఆరోపించాయి.
- నగరాన్ని అందంగా చూపించేందుకు పేదల జీవన పరిస్థితులను దాచడం అభివృద్ధి కాదని పేర్కొన్నాయి.
- అభివృద్ధి అంటే దాచడమా పేదలు నివసించే ప్రాంతాల్లో సరైన గృహాలు, తాగునీరు, పారిశుధ్యం, మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన ప్రభుత్వం..
- ప్రపంచ నేతలు వస్తున్న సమయంలో ఆ ప్రాంతాలను తెరల వెనుక దాచడమేంటని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3547ఆర్టికల్స్
4,44,361వ్యూస్










