మనోరంజని తెలుగు టైమ్స్ మాంజరి గ్రామంలో ఘనంగా వినాయక చవితి తొలి రోజు భక్తిశ్రద్ధలతో గణనాథుడి దర్శనం చేసుకున్న గ్రామస్తులు మండలం, మాంజరి గ్రామం: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మాంజరి గ్రామంలో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. తొలి రోజు గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు కుటుంబ సమేతంగా వినాయక మండపాలకు చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గణనాథుడి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు. వినాయకుడి నామస్మరణతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. తొలి రోజు ప్రతి ఒక్కరికీ గణనాథుడి దర్శన భాగ్యం కల్పించడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. మనోరంజని తెలుగు టైమ్స్, మాంజరి
మాంజరి గ్రామం లో వినాయక విగ్రహం ప్రతిష్టపన
Share:

సారాంశం
వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి
ముఖ్య విషయాలు
- తొలి రోజు గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- ఉదయం నుంచే భక్తులు కుటుంబ సమేతంగా వినాయక మండపాలకు చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
- గణనాథుడి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు.
- మనోరంజని తెలుగు టైమ్స్ మాంజరి గ్రామంలో ఘనంగా వినాయక చవితి తొలి రోజు భక్తిశ్రద్ధలతో గణనాథుడి దర్శనం చేసుకున్న గ్రామస్తులు మండలం, మాంజరి గ్రామం: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మాంజరి గ్రామంలో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Kadam Nagendhar
Reporter
7ఆర్టికల్స్
530వ్యూస్









