పోతారం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ పెద్ద భీమన్న స్వామి జాతర ఆదివారం నుంచి సోమవారం వరకు రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రత్యేక పూజలు, మొక్కులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
జాతరలో భాగంగా భీమన్న స్వామి పోతారం నుంచి పలు పల్లెలు, గ్రామాలకు బయలుదేరి తిరిగి శనివారం పోతారం గ్రామానికి చేరుకుంటారు. అనంతరం ఆదివారం గ్రామంలోని ప్రతి ఇంటికీ స్వామివారి దర్శనం కల్పించనున్నారు.
ఆదివారం సాయంత్రం స్వామివారు గంగాస్నానానికి వెళ్లనుండగా, రాత్రి 8 గంటల నుంచి ఆలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించనున్నారు.
సోమవారం కార్యక్రమాలు
సోమవారం ఉదయం మేడిగుంది భీమన్న ఆలయం వద్ద బండారు బసంతం కార్యక్రమం నిర్వహించిన అనంతరం భక్తులు మొక్కులు చెల్లించుకోనున్నారు.
ఈ జాతరలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ పెద్ద భీమన్న స్వామివారి ఆశీస్సులు పొందాలని గ్రామీణాభివృద్ధి కమిటీ, భీమన్న కమిటీ, గ్రామ పరిపాలన అధికారులు, గ్రామ ప్రజలు కోరుతున్నారు.
గ్రామీణాభివృద్ధి కమిటీ, భీమన్న కమిటీ, గ్రామ పరిపాలన అధికారులు, గ్రామ ప్రజలు ఈ ఉత్సవాలకు తరలిరావాలని కోరుతున్నారు.












