పట్టణ, నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన గణేష్ మండపానికి బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ప్రతి మండపానికి రూ 5,116, రూపాయలు అందజేస్తామని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీలకతీతంగా పట్టణంలోని ప్రతివార్డు,గ్రామాలలోలో ఏర్పాటు చేసిన గణేష్ మండపానికి రూ 5,116/- రూపాయలు చొప్పున వినాయక కమిటీ వారికి ఆయా వార్డుల కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, పార్టీ ఇన్చార్జులు, గ్రామాలలో సర్పంచులు, గ్రామ ఇన్చార్జులు, పార్టీ నాయకుల ద్వారా అందజేస్తామని ఎమ్మెల్యే వివరించారు. ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జులు, మున్సిపాలిటీలోని వార్డులలో గ్రామాలలో ఎన్ని మండపాలు ఉన్నాయో అనే వివరాలను త్వరగా ఈనెల 15 (మంగళవారం) ఉదయం లోగా అందజేయాలని కోరారు.బిఎల్ఆర్ బ్రదర్స్, అందరు నాయకులు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి రూ. 5, 116/- రూపాయలు అందజేయనున్నామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుకూరి బాలకృష్ణ, గుడిపాటి నవీన్ కుమార్, నూకల వేణుగోపాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తలకోప్పుల సైదులు, పోదిలే శ్రీనివాస్, వన్ టౌన్ టూ టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోడి రెక్క ఇంద్ర కుమార్, మోయిజ్, మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్, కౌన్సిలర్లు జావిద్, మలగం రమేష్, ఫారుక్ మొహమ్మద్, మనోజ్, బంటు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, చక్రి నాయక్, నాయకులు జలంధర్ రెడ్డి, దేశిడి శేఖర్ రెడ్డి, అయూబ్, తదితరులు పాల్గొన్నారు.
ప్రతి గణేష్ మండపానికి బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో
Share:

సారాంశం
రూ .5,116/- అందజేస్తాం :ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
ముఖ్య విషయాలు
- పట్టణ, నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన గణేష్ మండపానికి బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ప్రతి మండపానికి రూ 5,116, రూపాయలు అందజేస్తామని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు.
- పార్టీలకతీతంగా పట్టణంలోని ప్రతివార్డు,గ్రామాలలోలో ఏర్పాటు చేసిన గణేష్ మండపానికి రూ 5,116/- రూపాయలు చొప్పున వినాయక కమిటీ వారికి ఆయా వార్డుల కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, పార్టీ ఇన్చార్జులు, గ్రామాలలో సర్పంచులు, గ్రామ ఇన్చార్జులు, పార్టీ నాయకుల ద్వారా అందజేస్తామని ఎమ్మెల్యే వివరించారు.
- ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జులు, మున్సిపాలిటీలోని వార్డులలో గ్రామాలలో ఎన్ని మండపాలు ఉన్నాయో అనే వివరాలను త్వరగా ఈనెల 15 (మంగళవారం) ఉదయం లోగా అందజేయాలని కోరారు.బిఎల్ఆర్ బ్రదర్స్, అందరు నాయకులు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి రూ.
- సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3534ఆర్టికల్స్
4,43,967వ్యూస్










