నిర్మల్, 14 September
ఉట్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, ఖానాపూర్ ఎమ్మెల్యే మరియు జిల్లా డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్ గారిని, జిల్లా అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన జంగం శశిధర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన నాయకులను ఘనంగా సన్మానించి అభినందించారు.
*నూతన NSUI నాయకులకు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఘన సన్మానం* *ఉట్నూర్: ఉట్నూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖానాపూర్ ఎమ్మెల్యే, జిల్లా డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్ గారిని జిల్లా NSUI అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన జంగం శశిధర్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు.* *ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గారు నూతనంగా ఎన్నికైన NSUI నాయకులను ఘనంగా సన్మానించి అభినందించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల పరిరక్షణ కోసం NSUI నాయకులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు.* *కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను విద్యార్థులు, యువతలోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే గారు సూచించారు. నూతన బాధ్యతల్లో సమర్థవంతంగా పనిచేసి విద్యార్థులకు, పార్టీకి మంచి సేవలు అందించాలని ఆకాంక్షించారు.*












