గుడివాడ, 12 September
కామారెడ్డి పట్టణంలోని లేబర్ అడ్డా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీస్ కళాబృందం సభ్యులు కూలీలకు మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలు, మైనర్ డ్రైవింగ్‌పై పాటలు, మాటల ద్వారా అవగాహన కల్పించారు.
లేబర్ అడ్డాలో పోలీసుల అవగాహన కార్యక్రమం మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలు, మైనర్ డ్రైవింగ్‌పై అవగాహన ( కామారెడ్డి పట్టణంలోని లేబర్ అడ్డా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీస్ కళాబృందం సభ్యులు మాటలు, పాటల ద్వారా కూలీలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాలు, గంజాయి వంటి నిషేధిత పదార్థాలకు దూరంగా ఉండాలని, మైనర్లు వాహనాలు నడప ని పోలీసులు సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడ ని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. అదేవిధంగా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులకు ఓటీపీలు, వ్యక్తిగత వివరాలు వెల్లడించ ని హెచ్చరించారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని 1908కు తెలియజేయాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100/112కు ఫోన్ చేయాలని, మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. షీ టీమ్ సంప్రదింపు నంబర్ 8712686094గా పేర్కొన్నారు. దొంగతనాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ప్రమాదాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కళాబృందం ఇన్చార్జ్ హెడ్ కానిస్టేబుళ్లు రామంచ తిరుపతి, యు. శేషారావు, కానిస్టేబుళ్లు ప్రభాకర్, సాయిలు పాల్గొని పాటలు, మాటల ద్వారా అవగాహన కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కూలీలు కార్యక్రమంలో పాల్గొన్నారు.












