ఖానాపూర్, 11 September
ఖానాపూర్: మీ-సేవ వెబ్సైట్ మరియు ఎంఆర్ఓ కార్యాలయంలో సర్వర్ సమస్యల కారణంగా కుల ధృవీకరణ పత్రాల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
మీ-సేవ,MRO కార్యాలయంలో సర్వర్ సమస్యతో ఇబ్బందులు కుల ధృవీకరణ పత్రాల జారీలో తీవ్ర జాప్యం ఖానాపూర్: మీ-సేవ వెబ్‌సైట్‌తో పాటు యం ఆర్ ఓ కార్యాలయంలో కుల ధృవీకరణ పత్రాలకు సంబంధించిన సర్వర్ సమస్యలు తలెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వర్ సక్రమంగా పనిచేయకపోవడంతో కుల ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియ ఆలస్యమవుతోంది. కుల ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు, ఉద్యోగార్థులు, ఇతర అవసరాలున్న ప్రజలు సర్టిఫికెట్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే సర్వర్ సమస్య కారణంగా జాప్యం జరుగుతుండగా, వరుస సెలవుల నేపథ్యంలో ఈ ఆలస్యం మరింత పెరుగుతోంది. సర్టిఫికెట్లు సకాలంలో అందకపోవడంతో విద్యా ప్రవేశాలు, ఉద్యోగ దరఖాస్తులు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పనులపై ప్రభావం పడే అవకాశం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మీ-సేవ వెబ్సైట్ మరియు కార్యాలయంలోని సర్వర్ సమస్యను పరిష్కరించి, పెండింగ్‌లో ఉన్న కుల ధృవీకరణ పత్రాలను త్వరితగతిన జారీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. సర్వర్ సమస్య వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.








