సాయంత్రం (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 10
మిర్యాలగూడ క్లస్టర్ గ్రామీణ అభివృద్ధి అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ (ఏపీడీ)గా గార్లపాటి జ్యోతిలక్ష్మి గురువారం బాధ్యతలు స్వీకరించారు. గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ పనులను సమర్థవంతంగా పర్యవేక్షిస్తానని ఆమె తెలిపారు.
మిర్యాలగూడ ఏపీడిగా గార్లపాటి జ్యోతిలక్ష్మి బాధ్యతల స్వీకరణ మిర్యాలగూడ (మనోరంజని తెలుగు టైమ్స్) మిర్యాలగూడ క్లస్టర్ గ్రామీణ అభివృద్ధి అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ (ఎపిడి)గా గార్లపాటి జ్యోతిలక్ష్మి గురువారం మండల పరిషత్ ఆవరణలోని క్లస్టర్ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి, మహాత్మ గాంధీ గ్రామిణ ఉపాధి హామీ పథకం సంబంధించిన కార్యక్రమాలు, అభివృద్ధి పనులను సమర్థవంతంగా పర్యవేక్షిస్తూ,ఉద్యోగస్తులను సమన్వయం చేసు కుంటూ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకు వెళ్తానని అన్నారు. జ్యోతిలక్ష్మికి మిర్యాల గూడ మండల పరిషత్ సూప రింటెండెంట్ పి. కరుణాకర్ రావు, క్లస్టర్ ఇసి ఎం. కళావతి సిబ్బంది బొకే అందించి స్వాగతం శుభాకాంక్షలు తెలిపారు.












