పిప్రిలో ఘనంగా పొలాల అమావాస్య పండగ అన్నదాతకు సాగులో తోడుండే మూగజీవాలను కొలిచే పొలాల అమావాస్యను మండలంలోని పిప్రి గ్రామంలో ఘనంగా జరుపుకున్నారు. పూల దండలు, గజ్జెలు, కొత్త కన్నాలతో ముస్తాబు చేసిన బసవన్నలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలను సమర్పించారు. హనుమాన్ ఆలయం చుట్టూ ఎడ్లతో ప్రదక్షిణలు చేయించి మొక్కులు చెల్లించుకున్నారు. బసవన్నలు ఏడాది పొడవునా పడిన కష్టాలపై పొలాలఅమావాస్య రోజున సాంబశివుడి వద్ద గోడు వెల్లబోసుకుంటాయని రైతుల నమ్మకం అని గ్రామస్తులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు లోలం జీవరత్నం, కోశాధికారి మగ్గిడి రాజు, రైటర్లు మంగలి ముత్యం,గొల్ల రమేష్ కమిటీ సభ్యులు పీసర నరేష్ గౌడ్, దేవా గౌడ్, నల్ల భోజన్న, రావుల నరసయ్య, ముద్దం సాయన్న, కుమ్మరి శంకర్, ద్యావత్ నవీన్, రోడ్డ నరసయ్య మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
పిప్రిలో ఘనంగా పొలాల అమావాస్య పండగ
Share:

సారాంశం
పిప్రిలో పొలాల అమావాస్య పండగ జరుపుకున్న రైతులు
ముఖ్య విషయాలు
- పిప్రిలో ఘనంగా పొలాల అమావాస్య పండగ అన్నదాతకు సాగులో తోడుండే మూగజీవాలను కొలిచే పొలాల అమావాస్యను మండలంలోని పిప్రి గ్రామంలో ఘనంగా జరుపుకున్నారు.
- పూల దండలు, గజ్జెలు, కొత్త కన్నాలతో ముస్తాబు చేసిన బసవన్నలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలను సమర్పించారు.
- బసవన్నలు ఏడాది పొడవునా పడిన కష్టాలపై పొలాలఅమావాస్య రోజున సాంబశివుడి వద్ద గోడు వెల్లబోసుకుంటాయని రైతుల నమ్మకం అని గ్రామస్తులు వెల్లడించారు.
- హనుమాన్ ఆలయం చుట్టూ ఎడ్లతో ప్రదక్షిణలు చేయించి మొక్కులు చెల్లించుకున్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3469ఆర్టికల్స్
4,36,179వ్యూస్










