దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వేములవాడలో భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం ఏడో రోజు శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారు కాళరాత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు.
శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారు కాళరాత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. కాళరాత్రి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.










