దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్మల్ పట్టణంలోని పింజారి గుట్ట దుర్గామాత ఆలయం వద్ద శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.
శరన్నవరాత్రుల సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదం అందించి నిర్వాహకులు సేవాభావాన్ని చాటుకున్నారు. భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆధ్యాత్మిక వాతావరణంలో అన్నదాన కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు ఆలయ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.










