ఈ నెల 17, 18 తేదీలలో జరగనున్న గంగనీళ్ల జాతర నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, నిర్మల్ రూరల్ సీఐ కృష్ణ అడెల్లి ఆలయాన్ని సందర్శించారు. జిల్లా ఎస్పీ డా. జానకీ షర్మిల ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు జరిగాయి.
ఈ నెల 17, 18 తేదీలలో జరగనున్న గంగనీళ్ల జాతర నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, నిర్మల్ రూరల్ సీఐ కృష్ణ అడెల్లి ఆలయాన్ని సందర్శించారు. జిల్లా ఎస్పీ డా. జానకీ షర్మిల ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు జరిగాయి.
ఆలయ పరిసరాలను, పార్కింగ్ ప్రదేశాలను డీఎస్పీ శ్రీనివాస్ పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు.
శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత సిబ్బందికి డీఎస్పీ శ్రీనివాస్ సూచనలు చేశారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.










