ముధోల్, 13 September
మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ భవనం తీవ్ర శిథిలావస్థకు చేరుకుంది. పాత భవనం ఏళ్లుగా నామమాత్రపు మరమ్మతులతోనే కొనసాగుతుండటంతో, వర్షం వస్తే భవనం కూలిపోతుందన్న భయంతో అధికారులు, సిబ్బంది, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే కొత్త భవనం నిర్మించాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
శిథిలావస్థలో తహసీల్దార్ కార్యాలయం వర్షం వస్తే భయమే.. కొత్త భవనం నిర్మించాలి , సెప్టెంబరు 13: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరింది. పాతకాలంలో నిర్మించిన ఈ భవనం ఏళ్లుగా మరమ్మతులతోనే నెట్టుకొస్తోంది. వర్షం కురిసినప్పుడు భవనం ఎప్పుడు కూలుతుందోనన్న భయంతో అధికారులు, సిబ్బంది, కార్యాలయానికి వచ్చే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శిథిలావస్థలో ఉన్న భవనంలో విధులు నిర్వహించడం ప్రమాదకరంగా మారిందని స్థానికులు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో నామినేషన్ల స్వీకరణ కూడా ఇక్కడే జరుగుతుందని, భవనం పరిస్థితి ఇలాగే ఉంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. తక్షణమే నూతన తహసీల్దార్ కార్యాలయ భవనం నిర్మించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కె. గురు ప్రసాద్ యాదవ్, ఎస్. ఉదయ్‌కుమార్,జి. ప్రేమ్‌నాథ్‌రెడ్డి, ఎన్. పోతారెడ్డి, బి.ధర్మతేజరెడ్డి, భీమ్రావు డోంగ్రే తదితరులు ప్రభుత్వాన్ని కోరారు...












