కరీంనగర్, 9 September
జిల్లా కేంద్రంలో ఇటీవల జరిగిన ఏఐటీయూసీ నాలుగో రాష్ట్ర మహాసభల్లో కామారెడ్డి జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శి ఎల్. దశరథ్కు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా అవకాశం లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటాలు చేస్తామని తెలిపారు.
ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్లో దశరథ్కు అవకాశం కామారెడ్డి: జిల్లా కేంద్రంలో ఈ నెల 6, 7, 8 తేదీల్లో నిర్వహించిన ఏఐటీయూసీ నాలుగో రాష్ట్ర మహాసభల్లో కామారెడ్డి జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శి ఎల్. దశరథ్కు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా అవకాశం లభించింది. ఈ సందర్భంగా దశరథ్ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చడాన్ని, పని గంటలను 8 నుంచి 10–12 గంటలకు పెంచే నిర్ణయాలను వ్యతిరేకిస్తామన్నారు. కనీస వేతనాలు పెంచాలని, పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.











