ఆదిలాబాద్, 9 September
నిర్మల్ జిల్లా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ()లో 26 ఏళ్ల పాటు సేవలందించి, ఇటీవల పదవీ విరమణ చేసిన బిట్ల గంగన్నను ఆయన చిన్ననాటి మిత్రులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ గోకా గణేష్ రెడ్డి నేతృత్వంలోని బృందం బుధవారం ఘనంగా సన్మానించింది. రుయ్యడి గ్రామంలోని ఆయన స్వగృహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేసి అభినందనలు తెలిపారు.
జిల్లా అధికారిగా ఎదిగిన బిట్ల గంగన్న సన్మానించిన చిన్ననాటి మిత్రుడు మాజీ జెడ్పిటిసి గోకా గణేష్ రెడ్డి మిత్ర బృందం. జిల్లా తలమడుగు మండల్ రుయ్యడి గ్రామానికి చెందిన గత నెల 31న నిర్మల్ జిల్లా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ డిఆర్డిఏ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ పదవి విరమణ పొందిన బిట్ల గంగన్న ఆయన చిన్ననాటి మిత్రులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి గోకా గణేష్ రెడ్డి మిత్ర బృందం కలిసి బుధవారం రుయ్యాడి గ్రామంలో ఆయన సొంత ఇంటి వద్ద మిత్రబృందం అందరి వెళ్లి బిట్ల గంగన్న శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గోక గణేష్ రెడ్డి మాట్లాడుతూ బిట్ల గంగన్న చిన్ననాటి నుంచి చదువులలో ముందుండి కడు పేదరికం నుంచి అంచలంచలుగా ఎదుగుతూ ఎంఏ పొలిటికల్ సోషయాలజీ ఇంగ్లీష్ ఎల్.ఎల్.బి పూర్తి చేసిన ఆయనకు ఎన్నో ఉన్నత ఉద్యోగాలలో అవకాశం వచ్చిన దాని తీజించి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలు చేరి పేదరికంపై పోరాడి ఎందరో మందికి జీవనోపాధి కలిగించి తన జీవిత కాలంలో సంపాదించినా జ్ఞానాన్ని పేదవారికి అంకితం చేసిన మహోన్నత వ్యక్తిగా అయినా చేసిన సేవ ఎప్పటికీ చేరవేణి ముద్రగా ఉండిపోయిందని అన్నారు. 2000 సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలుగు అనే పథకంతో నామకరణం చేసి గ్రామీణ ప్రాంతాలలో ని పేదరిక నిర్మూలన నిర్మించాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన పథకంలో బిట్ల గంగన్న సీసీగా కమ్యూనిటీ కోఆర్డినేట్ గా వీధిలో చేరి అంచలంచెలుగా ఏపీఎంగా డీపీఎంగా విధులు నిర్వహిస్తూ 26 సంవత్సరాలు గ్రామీణ పేదరిక నిర్మల సంస్థలో పనిచేసి ఎందరికో ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అయినా చేసిన సేవలు ఏనాటికి మరిచిపోలేవని అన్నారు ఈ సన్మాన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బుడుగు రాకేష్ ఉప సర్పంచ్ వెంకటేష్ వార్డ్ సభ్యులు ఉత్తం ప్రకాష్ రెడ్డి అశోక్ వెంకన్న యాదవ్ మాజీ ఎంపిటిసి గ్రామ పెద్దలు గోనెల గంగన్న జి సంజీవరెడ్డి జి ప్రకాష్ రెడ్డి ఏ అయ్యన్న టి గంగన్న సాంబశివ రాజేశ్వర్ ఆర్ బాలాజీ ఏ మోహన్ పోశెట్టి మార్కెట్ డైరెక్టర్ గ్రామస్తులు తదితరులు ఘనంగా సన్మానించారు.











