సమర్పించిన (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 09
తెలంగాణ ప్రజాకవి, స్వాతంత్ర్య సమరయోధుడు కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీయస్ కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
*నిర్మల్ పోలీస్- మీ పోలీస్* *కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఘన నివాళులు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల IPS* నిర్మల్ (మనోరంజని తెలుగు టైమ్స్ నిర్మల్ జిల్లా ప్రతినిధి) తెలంగాణ ప్రజాకవి, స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రజా ఉద్యమాల గొంతుక కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారుఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీయస్ కాళోజీనారాయణరావుచిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారుఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూకాళోజీనారాయణరావు తెలంగాణ ప్రజల సమస్యలను తన రచనలు, కవిత్వం ద్వారా సమాజానికి తెలియజేసిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. ప్రజల్లో చైతన్యంతీసుకురావడంలో సామాజికవిలువలనుపెంపొందించడంలో ఆయన సాహిత్యం ఎంతో కీలకపాత్రపోషించిందనిపేర్కొన్నారు.కాళోజీ “నా గొడవ” వంటి రచనలు ప్రజల ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసి, అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యాన్ని కల్పించాయని అన్నారు. ఆయన ఆశయాలు, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక బాధ్యత వంటి స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కొనసాగించాలనిఎస్పీసూచించారు. కాళోజీనారాయణరావుఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు పోలీసు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ ఓ యూనస్ అలీ, ఎస్బి సీఐ మల్లేష్, ఆర్ ఐ లు రామ్ నిరంజన్, శేఖర్, శ్రీపాల్, ఆర్ ఎస్ ఐ లు మరియు డీపీఓసిబ్బంది పాల్గొన్నారు












