ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. మండల అధ్యక్షుడు పుట్నాల సాయినాథ్ పటేల్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో ప్రధాని మోదీ పేరుపై ప్రత్యేక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద యాచకులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పుట్నాల సాయినాథ్ పటేల్ మాట్లాడుతూ, ప్రపంచంలోని పలు దేశాలు ప్రధాని నరేంద్ర మోదీని ఆదర్శంగా తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. యువత మోదీ అడుగుజాడల్లో నడవాలని అన్నారు.
మాజీ సర్పంచ్ పోతుగంటి సతీశ్వర రావు మాట్లాడుతూ, యువత సనాతన ధర్మం, దేశ హితం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు.
అనంతరం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బస్టాండ్ వద్ద బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
కార్యక్రమాల్లో నాయకులు సుద్ద సాయిబాబా, దేవుని శంకర్, రువ్వొడ్ జలంధర్, కొందపురం గంగాధర్, జిడ్డు సుభాష్, భగవంత్ రావుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












