మిర్యాలగూడ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
మిర్యాలగూడ పట్టణంలోని 6వ వార్డు ఇందిరమ్మ కాలనీలో గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు, మిర్యాలగూడ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, యువనాయకులు నల్లమోతు సిద్ధార్ధ ఆదేశాలతో 6వ వార్డు ఇంచార్జ్ భూక్య రాంబాబు నాయక్ ఆధ్వర్యంలో కృతజ్ఞత పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అన్నబీమోజు నాగార్జున చారి, మాజీ మార్కెట్ చైర్మన్ ధనావత్ చిట్టిబాబు నాయక్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎండి. ఇలియాస్ ఖాన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి. మగ్దుం పాషా, సీనియర్ నాయకులు, కౌన్సిలర్ పెద్ది శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్ ఎండి. మాజీద్ లు హాజరయ్యారు. 6వ వార్డు బీఆర్ఎస్ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీకి చెందిన గిరిజనులు, నాయకులు, కాలనీవాసులు కలిసి ముందుగా బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతగా మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో 40 తండాలను కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడం, గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడం, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు చేపట్టినందుకు కేసీఆర్కు, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మర్రి అంజిబాబు, లావూరి అరుణ సుధాకర్ నాయక్, 10వ వార్డు ఇంచార్జ్ ఎనుగంటి తిరుపతి రావు, 6వ వార్డు బీఆర్ఎస్ అధ్యక్షులు సుంకోజు మురళి చారి, బిసి సెల్ అధ్యక్షులు పులిపలుపుల శ్రీనివాస్ గౌడ్, మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ ఫయాజ్, అలీమోద్దిన్, పామోజు రామాచారి, కంబంపాటి సంతోష్, లాలూ నాయక్, అల్లి వెంకన్న, పోతులూరి చారి, చిన్నాల శ్రీను, కొంపల్లి ఉపేందర్, మెరుగు శివలింగం, అవిరెండి కృష్ణ యాదవ్, జేజాల మణెమ్మ, కొల్లి జగదీశ్, రమావత్ పద్మ, బాలకృష్ణ, పాతులోతు సురేష్, భూక్య అరుణ, లలిత, ఇంద్రజ, మాలోతు శ్రీధర్, అంగోతు రాజేష్, కోటమ్మ, నేనావత్ గిరిజ, పూడూరు నరసింహ, రామావత్ స్వామీ, తరి శ్రీను, కొల్లి శ్రావణి, పానుగోతు జ్యోతి, పద్మ, శేఖర్, రామకృష్ణ, బండి నాగరాజు, వల్లవాయి పద్మ, ఉమ్లా నాయక్, నీల నాయక్, ఇస్లావాత్ జానకి, కోటి రెడ్డి, మకం అనుష, తదితర గిరిజన మహిళా నాయకులు పాల్గొన్నారు.












