జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) 2027లో నిర్వహించనున్న పలు కీలక ప్రవేశ, అర్హత పరీక్షలకు సంబంధించిన తాత్కాలిక పరీక్షల క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఇందులో జేఈఈ మెయిన్ 2027, యూజీసీ నెట్, సీయూఈటీ పీజీ వంటి పరీక్షలు ఉన్నాయి. మొత్తం 14 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్టీఏ ప్రకటించింది.
ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ 2027 తొలి సెషన్ నుంచి ప్రారంభం కానుంది. , 24 తేదీలతో పాటు , 30 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ను ప్రత్యామ్నాయ తేదీగా కేటాయించారు.
జనవరిలో రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ పరీక్ష, శ్రేష్ఠ పరీక్ష, నిఫ్ట్ ప్రవేశ పరీక్ష వంటి పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరిలో సీమ్యాట్ పరీక్ష నిర్వహించనున్నారు. , 27 తేదీల్లో ఎన్ఐటీటిటి పరీక్ష జరగనుంది.
పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే సీయూఈటీ పీజీ 2027 పరీక్షలను మార్చి నెలలో పలు తేదీల్లో నిర్వహించనున్నారు. నుంచి 5 నుంచి 20 వరకు, అలాగే , 25 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తాత్కాలిక షెడ్యూల్లో పేర్కొన్నారు. తేదీని ప్రత్యామ్నాయ తేదీగా ఉంచారు.
ఎన్టీఏ ప్రకటించిన ఈ క్యాలెండర్ తాత్కాలికమైనది మాత్రమే. పరిపాలనా, విద్యా, సాంకేతిక, లాజిస్టిక్స్ లేదా ఇతర అనూహ్య కారణాల వల్ల పరీక్ష తేదీల్లో మార్పులు జరిగే అవకాశం ఉందని సంస్థ స్పష్టం చేసింది. అలాగే క్యాలెండర్ విడుదలైనంత మాత్రాన ఆయా పరీక్షలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదలైనట్లు కాదని ఎన్టీఏ తెలిపింది. దరఖాస్తు తేదీలు, పూర్తి పరీక్ష వివరాలు తదుపరి అధికారిక నోటిఫికేషన్లలో వెల్లడవుతాయి. అందువల్ల విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతూనే ఎన్టీఏ అధికారిక ప్రకటనలను ఎప్పటికప్పుడు పరిశీలించడం మంచిది.












