మండలంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ గ్రామాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. బోరిగాం గ్రామంలోని బాలాజీ గుట్టపై గ్రామ అధ్యక్షుడు పల్లె విఠల్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మోదీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. అదేవిధంగా బోసి గ్రామంలోని వినాయక మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మండల అధ్యక్షుడు పుండ్ర లక్ష్మణ్రెడ్డి, మండల భాజపా ప్రధాన కార్యదర్శి బాయి నర్సింహులు, మాజీ సర్పంచ్ సింగన్గాం మారుతి, బోరిగాం సర్పంచ్ సుధాకర్, నాగన్న, బోసి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహణ
Share:

సారాంశం
మోదీ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు, కేక్ కటింగ్
ముఖ్య విషయాలు
- మండలంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ గ్రామాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు.
- బోరిగాం గ్రామంలోని బాలాజీ గుట్టపై గ్రామ అధ్యక్షుడు పల్లె విఠల్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు.
- అనంతరం మోదీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Jondhale Rajender
Reporter
Tanur
101ఆర్టికల్స్
10,141వ్యూస్










