సోనాపేట్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 08
వికసిత భారత్ గ్యారంటీ, జీవిక మిషన్ గ్రామీణ్ (ఉపాధి హామీ పథకం)లో భాగంగా 202728 ఆర్థిక సంవత్సరానికి సోనాపేట్ గ్రామంలో చేపట్టాల్సిన పనులను గుర్తించే ప్రణాళికపై గ్రామసభను నిర్వహించారు. సర్పంచ్ తోట నరసవ్వ మల్లేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గ్రామ అభివృద్ధికి అవసరమైన వివిధ పనులపై చర్చించారు.
గ్రామసభలో ఉపాధి హామీ పనుల ప్రణాళికపై చర్చ ( వికసిత భారత్ గ్యారంటీ, జీవిక మిషన్ గ్రామీణ్ (ఉపాధి హామీ పథకం)లో భాగంగా 2027–28 ఆర్థిక సంవత్సరానికి సోనాపేట్ గ్రామంలో చేపట్టాల్సిన పనులను గుర్తించే ప్రణాళికపై గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ తోట నరసవ్వ మల్లేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గ్రామ అభివృద్ధికి అవసరమైన వివిధ పనులపై చర్చించారు.ప్రణాళికలో భాగంగా మ్యాజిక్స్ సోక్ పిట్, ఫారం పాండ్లు, హార్వెస్ట్ పాండ్లు, బోర్వెల్ డిశ్చార్జ్ స్ట్రక్చర్లు, రూల్స్ ట్యాంకులు, పంట కాల్వలు, తోటల పెంపకం, వర్మీ కంపోస్ట్, పారా మిషన్ రోడ్లు, కచ్చా డ్రైనేజీలు, వనమహోత్సవం తదితర పనులను గుర్తించి వాటి అమలుపై గ్రామసభలో చర్చించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రతిభ బేగం, ఏపీవో ఓంకార్, కార్యదర్శి రాజ్యలక్ష్మి, షర్మిల, ఫీల్డ్ అసిస్టెంట్ చిన్నబాబు, సుశీల, గౌతమి, సుజాత, డేవిడ్, పులి గంగాధర్‌తో పాటు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.












