నిర్మల్ జిల్లా మండలంలోని బామ్నీ తండాలో ఇద్దరు రైతులు నూతనంగా కొనుగోలు చేసిన రెండు ట్రాక్టర్లను ముధోల్ మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
బామ్నీ తండాకు చెందిన రాథోడ్ కరం సింగ్, జాదవ్ భరబ్ సింగ్ నూతనంగా రెండు ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రాక్టర్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే జి. విట్టల్ రెడ్డి, ట్రాక్టర్లను ప్రారంభించి, వాటి యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సాగర భాయ్ రాజన్న, మాజీ ఆత్మ చైర్మన్ పోతరెడ్డి, కుబీర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాథోడ్ అరుణ్ కుమార్, బామ్నీ తండా గ్రామపంచాయతీ సర్పంచ్ రాథోడ్ రోహిదాస్, మాజీ సర్పంచ్ గంగాధర్ పాల్గొన్నారు. వీరితో పాటు గ్రామస్తులు, బంధువులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












