లోకేశ్వరం, 10 September
నీట్ ప్రవేశ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ సాధించి రామగుండం మెడికల్ కాలేజీలో వైద్య విద్య సీటు పొందిన లోకేశ్వరం మండలానికి చెందిన మెండె సాయి చైతన్యను స్థానికులు ఘనంగా సత్కరించారు. గురువారం ఆయన స్వగృహానికి వెళ్లిన పలువురు ప్రముఖులు ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
నీట్లో రాష్ట్ర స్థాయి ర్యాంక్.. మెండె సాయి చైతన్యకు ఘన సన్మానం లోకేశ్వరం, సెప్టెంబర్ 10 ( నీట్ ప్రవేశ పరీక్షలో రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించి రామగుండం మెడికల్ కాలేజీలో వైద్య విద్య సీటు పొందిన లోకేశ్వరం మండలానికి చెందిన మెండె సాయి చైతన్యను గల్లీ సభ్యులు ఘనంగా సత్కరించారు.గురువారం సాయి చైతన్య స్వగృహానికి వెళ్లిన డాక్టర్ వెంకటేష్, బాగాపూర్ ఆలయ పూజారి నర్సింహాచారి, నాగేష్ సార్, సాయినాథ్, మధు తదితరులు ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్లో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచి వైద్య విద్యలో సీటు సాధించడం అభినందనీయమన్నారు. సాయి చైతన్య భవిష్యత్తులో మంచి వైద్యుడిగా స్థిరపడి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. విద్యాభ్యాసంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకున్నారు.












