కొత్తగూడ, 10 September
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా అజ్మీర సురేష్ నాయక్ వరుసగా నియమితులయ్యారు. విద్యార్థుల సమస్యలపై ఆయన చేసిన పోరాటాలు, విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేయడంలో చూపిన చురుకైన పాత్రకు గుర్తింపుగా రాష్ట్ర నాయకత్వం ఈ బాధ్యతలను మరోసారి అప్పగించింది. హైదరాబాద్‌లో రాష్ట్ర అధ్యక్షుడు యడవల్లి వెంకటస్వామి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు.
జిల్లా అధ్యక్షుడిగా అజ్మీర సురేష్ నాయక్ కొత్తగూడెం, సెప్టెంబరు 10: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా అజ్మీర సురేష్ నాయక్ వరుసగా నియమితులయ్యారు. హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు యడవల్లి వెంకటస్వామి చేతుల మీదుగా గురువారం నియామక పత్రాన్ని స్వీకరించారు. విద్యార్థుల సమస్యలపై నిరంతర పోరాటం, విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం చేపట్టిన ఉద్యమాలు, జిల్లాలో విద్యార్థి విభాగాన్ని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో ఆయన చూపిన చురుకైన పాత్రను గుర్తించిన రాష్ట్ర నాయకత్వం మరోసారి జిల్లా అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది. ఈ సందర్భంగా అజ్మీర సురేష్ నాయక్ మాట్లాడుతూ ఒక్కసారి బాధ్యత దక్కడం గౌరవంగా భావిస్తే, వరుసగా అదే బాధ్యత అప్పగించడం తనపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర నాయకత్వం తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ జిల్లాలో విద్యార్థుల సమస్యలపై మరింత బలంగా పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులకు అన్యాయం జరిగిన ప్రతి సందర్భంలో విద్యార్థి విభాగం ముందుండి ప్రశ్నిస్తుందని, వారి హక్కుల కోసం అవసరమైతే ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటామని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రఘురాంరెడ్డి, విద్యార్థి విభాగం జాతీయ అధ్యక్షుడు వినోద్ జాకర్, రాష్ట్ర అధ్యక్షుడు యడవల్లి వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ బాధ్యత తనకు పదవి మాత్రమే కాదని, విద్యార్థుల కోసం మరింత బాధ్యతగా పనిచేసే అవకాశమని అన్నారు. గతంలో కంటే రెట్టింపు ఉత్సాహంతో, నిబద్ధతతో విద్యార్థుల గొంతుకగా నిలుస్తానని స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రతి కళాశాలకు, ప్రతి విద్యార్థికి చేరువై బలమైన విద్యార్థి ఉద్యమంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలిపారు. దక్కిన బాధ్యతను మరింత శక్తివంతమైన విద్యార్థి ఉద్యమానికి పునాదిగా మార్చి విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామని అజ్మీర సురేష్ నాయక్ పేర్కొన్నారు.












