లోకేశ్వరం, 9 September
తెలంగాణ ప్రజల హక్కుల కోసం, సామాజిక చైతన్యం కోసం తన కలం ద్వారా నిరంతరం పోరాడిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను మండలంలోని కనకాపూర్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఘనంగా కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ప్రజాకవి సేవలను స్మరించుకున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు మండలంలోని కనకాపూర్ గ్రామంలో.. ప్రాథమిక పాఠశాల లో తెలంగాణ ప్రజల హక్కుల కోసం, సామాజిక చైతన్యం కోసం తన కలం ద్వారా నిరంతరం పోరాడిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను మండలంలోని ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన తెలంగాణ సమాజానికి అందించిన సేవలను, ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో పోషించిన పాత్రను ఉపాధ్యాయులు, విద్యార్థులు స్మరించుకున్నారు.కాళోజీ రచనలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, సమాజంలోని సమస్యలను తన కలం ద్వారా ప్రశ్నించిన గొప్ప ప్రజాకవిగా ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. విద్యార్థులు కాళోజీ జీవిత విశేషాలు, సాహిత్య సేవల గురించి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మధుసూదన్ రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు రజిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.ప్రజల గొంతుకగా నిలిచిన కాళోజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు నిజమైన నివాళి” అని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు.












