రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం, తెలంగాణ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 09
రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) తెలుగు శాఖ ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 112వ జయంతి, తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపకులపతి ప్రొఫెసర్ ఏ. గోవర్ధన్ కాళోజీ చిత్రపటానికి నివాళులర్పించి, తెలుగు శాఖ రూపొందించిన రెండు వ్యాస సంపుటాలను ఆవిష్కరించారు.
ఆర్జీయూకేటీలో ఘనంగా కాళోజీ జయంతి రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) తెలుగు శాఖ ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 112వ జయంతి, తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపకులపతి ప్రొఫెసర్ ఏ. గోవర్ధన్ కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.తెలుగు శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘వ్యాస సరస్వతి’, ‘వ్యాస వాణి’ రెండు వ్యాస సంపుటాలను ఉపకులపతి ఆవిష్కరించారు. ఈ పుస్తకాలకు డాక్టర్ ఎం. రమాదేవి, డాక్టర్ జె. రాయమల్లు సంపాదకత్వం వహించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ తెలుగు భాష అభివృద్ధికి తెలుగు శాఖ చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. సాంకేతిక విద్యతోపాటు మాతృభాషపై విద్యార్థులు ఆసక్తి పెంచుకోవాలని సూచించారు.బీటెక్‌లో తెలుగు సాహిత్యాన్ని మైనర్ కోర్సుగా ప్రవేశపెట్టేందుకు అవసరమైన విధివిధానాలపై ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు. తెలుగు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ఉపకులపతి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో తెలుగు శాఖ విభాగాధిపతి డాక్టర్ ఎం. రమాదేవి, డాక్టర్ జె. రాయమల్లు, అధ్యాపకులు డాక్టర్ విజయ్‌కుమార్, డాక్టర్ గోపాలకృష్ణ, డాక్టర్ రాములు, డాక్టర్ బాలకృష్ణ, యు. ముత్యం, పి. రాములు, లక్ష్మీ, డాక్టర్ జి. అనిల్‌కుమార్, చింతా నరేశ్, ఎం. హరికృష్ణతో పాటు బోధనా, బోధనేతర సిబ్బంది, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.












