చెందిన (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 09
కౌఠ (బి) ఉన్నత పాఠశాలకు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు శశిధర్‌రెడ్డి, శ్రీరామ్‌లను స్థానిక స్వామి వివేకానంద యువజన సభ్యులు బుధవారం ఘనంగా సన్మానించారు. పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపాధ్యాయులకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు.
జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం బోథ్, సెప్టెంబరు 9 ( కౌఠ (బి) ఉన్నత పాఠశాలకు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు శశిధర్‌రెడ్డి, శ్రీరామ్‌లను స్థానిక స్వామి వివేకానంద యువజన సభ్యులు బుధవారం ఘనంగా సన్మానించారు. పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపాధ్యాయులకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, వారి భవిష్యత్తుకు బాటలు వేస్తూ విద్యారంగంలో విశిష్ట సేవలు అందించినందుకు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు దక్కడం పట్ల యువజన సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డులు పాఠశాలకు, గ్రామానికి గర్వకారణమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అంజయ్య, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, రమణగౌడ్, రాజురెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, స్వామి వివేకానంద యువజన సభ్యులు, యువకులు పాల్గొన్నారు.












