మిర్యాలగూడ, 9 September
మిర్యాలగూడ పట్టణంలోని విజేత డిగ్రీ కళాశాలలో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ సమాజంలో అన్యాయాన్ని ప్రశ్నించిన మహనీయుడని కళాశాల ప్రిన్సిపాల్ ధనుంజయ్ కొనియాడారు.
విజేత డిగ్రీ కళాశాలలో తెలంగాణ విద్యావం తుల వేదిక ఆధ్వ ర్యంలో ఘనంగా కాళోజీ జయంతి మిర్యాలగూడ (మనోరంజని తెలుగు టైమ్స్) సమాజంలో అన్యా యం, అవినీతి, అమానుషత్వం, దౌర్జన్యం పెరిగినప్పుడు ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించిన మహనీయు డు కాళోజీ నారాయణ రావు అని విజేత డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ధనుంజయ్ అన్నారు. బుధవారం మిర్యాల గూడ పట్టణంలోని విజేత డిగ్రీ కళాశాలలో తెలంగాణ విద్యా వంతుల వేదిక ఆధ్వర్యంలో కాళోజీ యాది కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించా రు.ఈ సందర్భంగా ధనుంజయ్ మాట్లాడు తూ సమాజం ఆపత్కాలంలో ఉన్నప్పుడు, ప్రశ్న వెనుకబడినప్పుడు, పాలకులు నియంత లుగా మారినప్పుడు కాళోజీ యాదికొస్తారని అన్నారు. 20వ శతా బ్దపు తెలంగాణ ప్రజాకవిగా కాళోజీ సాహిత్య, సాంస్కృతిక ఉద్యమాల చరిత్రలో చెరగని అధ్యాయంగా నిలిచారని పేర్కొన్నారు. తన రచనలు, ఉద్యమాల ద్వారా అనేక తరాలను ప్రభావితం చేసిన కాళోజీ అన్యాయాన్ని ప్రశ్నించడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయలేదన్నారు.మానవతకు తలవొంపులు వచ్చినప్పుడు, మనిషి మనిషిగా జీవించలేని పరిస్థితులు ఏర్పడి నప్పుడు కాళోజీ తీవ్రంగా స్పందించే వారని తెలిపారు. ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిన ప్రతిసారీ ప్రజల గొంతుకగా నిలిచిన ఆయన జీవితం నేటి తరానికిస్ఫూర్తిదాయకమన్నారు.కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మధు, చారి,యాద య్య,హరి,దుర్గయ్య, రాజారాం, సతీష్, వీరయ్య, జ్యోతి, పాపయ్య, రేణుక, బాలాజీ, నిహారిక, చారి తదితరులు పాల్గొన్నారు.












