నిజామాబాద్, 10 September
నిజామాబాద్ డివిజన్ పరిధిలో 6 నుంచి 9వ తరగతి విద్యార్థుల కోసం దీన్‌దయాళ్ స్పర్శ్ యోజన క్విజ్ పోటీలను తపాలా శాఖ నిర్వహిస్తోంది. ఫిలాటెలీపై విద్యార్థుల్లో ఆసక్తిని పెంచడమే ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు.
దీన్‌దయాళ్ స్పర్శ్ యోజన క్విజ్ పోటీలు నిజామాబాద్: తపాలా శాఖ ఆధ్వర్యంలో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ప్రాంతీయ స్థాయిలో ‘దీన్‌దయాళ్ స్పర్శ్ యోజన’ క్విజ్ (రాతపరీక్ష) పోటీలు నిర్వహించనున్నట్లు నిజామాబాద్ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్ కె. జనార్ధన్‌రెడ్డి తెలిపారు. విద్యార్థుల్లో తపాలా బిళ్లల సేకరణ (ఫిలాటెలీ)పై ఆసక్తి, అవగాహన పెంపొందించడమే పోటీల ఉద్దేశమని పేర్కొన్నారు. 6 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులని తెలిపారు. పోటీలో పాల్గొనే విద్యార్థులు తప్పనిసరిగా ఫిలాటెలీ డిపాజిట్ ఖాతా కలిగి ఉండాలని సూచించారు. క్విజ్‌లో విజయం సాధించిన విద్యార్థులు ఫిలాటెలీ ప్రాజెక్టు పనిని సమర్పించాల్సి ఉంటుందని, ఎంపికైన వారికి ఉపకారవేతనం అందజేస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు సెప్టెంబరు 21లోగా సమీప తపాలా కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. దరఖాస్తు ఫారాలు అన్ని తపాలా కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.












