మన్సురాబాద్ డివిజన్, ఎల్బీనగర్, హైదరాబాద్, తెలంగాణ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 15
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఎల్బీనగర్లోని నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో గణనాథుడి విగ్రహం వద్ద తొలి పూజ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు జక్కిడి ప్రభాకర్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు తొలి పూజలో పాల్గొన్న సీనియర్ నాయకుడు జక్కిడి ప్రభాకర్‌రెడ్డి ఎల్బీనగర్: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఎల్బీనగర్లోని నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహం వద్ద తొలి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు జక్కిడి ప్రభాకర్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 34 ఏళ్ల క్రితం తన నాయకత్వంలో ఏర్పాటైన నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వరుసగా 34 ఏళ్లుగా వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. విఘ్నేశ్వరుడి కృప ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మన్సురాబాద్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు స్వామిగౌడ్, ఇరిగి రమేశ్, భాస్కర్‌గౌడ్, రాజు, ఆనంద్, సత్తి, వెంకటేశ్, శ్రీను, విఠల్‌రెడ్డి, గురుస్వామి, లక్ష్మణ్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.












