నిర్మల్ జిల్లా మండలంలోని ఆడెల్లి శ్రీ మహా పోచమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారిని మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఆడెల్లి శ్రీ మహా పోచమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారికి మహిషాసుర మర్దిని అలంకరణ చేశారు. ఈ అలంకరణలో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ, మృత్యుంజయ శర్మల ఆధ్వర్యంలో అమ్మవారికి మహిషాసుర మర్దిని అలంకరణతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుంకుమార్చనలు చేసి, మంగళహారతులు సమర్పించారు. పూజల అనంతరం భక్తులకు ఆశీర్వచనాలు అందించి, ప్రసాదాలను పంపిణీ చేశారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని, అమ్మవారి ఆశీర్వాదాలు పొందుతున్నారు. ఆలయ ప్రాంగణం మొత్తం భక్తి వాతావరణంతో నిండిపోయింది.











