దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లక్ష్మణచందాలో అష్టభుజ వేణుగోపాలస్వామి రథయాత్ర అట్టహాసంగా జరిగింది. మహర్నవమి పర్వదినాన, సింహ వాహనంపై స్వామివారిని గ్రామ వీధుల్లో ఊరేగించారు. ఈ వేడుకలకు పొరుగు గ్రామాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లక్ష్మణచందాలోని అష్టభుజ వేణుగోపాలస్వామి రథయాత్ర వైభవంగా కొనసాగుతోంది. మహర్నవమి సందర్భంగా దుర్గాదేవి ఊరేగింపుతో పాటు తొమ్మిదవ రోజు సింహ వాహనంపై శ్రీ అష్టభుజ వేణుగోపాల స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి గ్రామ వీధుల్లో ఊరేగించారు. ఈ ఊరేగింపునకు మహిళలు హారతులతో స్వాగతం పలికారు. గ్రామస్థులు కోలాటాలు ఆడుతూ, భక్తిగీతాలు ఆలపిస్తూ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వామివారి దర్శనం కోసం పొరుగు గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.











