మండల కేంద్రంతో పాటు పోరుమల్ల, కట్లకుంట గ్రామాల్లో కొలువుదీరిన శ్రీ దుర్గాదేవి అమ్మవారిని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని అమ్మవారి మండపాల్లో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
అమ్మవారి ప్రార్థనలు
ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.











