నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గంగా శ్రీనివాస్‌కు అసిస్టెంట్ కమిషనర్‌గా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, సహోద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
విధి నిర్వహణలో నిబద్ధతతో వ్యవహరిస్తూ, ఉద్యోగులకు అందుబాటులో ఉంటూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న శ్రీనివాస్‌కు పదోన్నతి లభించడం సంతోషకరమని ఆలయ పర్యవేక్షకుడు దేవునే శివరాజ్ పేర్కొన్నారు. క్రమశిక్షణకు ప్రాధాన్యమిస్తూ, బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్న ఆయన సేవలు అభినందనీయమని అన్నారు.
భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో, ఆలయ నిర్వహణలో బాధ్యతలు నిర్వర్తించడంలో గంగా శ్రీనివాస్ కీలక పాత్ర పోషిస్తున్నారని సహోద్యోగులు కొనియాడారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.










