నిర్మల్ జిల్లా మండలం సిర్పెల్లి హెచ్ గ్రామంలో దసరా నవరాత్రుల సందర్భంగా నిర్వహించనున్న కర్ర దుర్గామాత ఉత్సవాలకు హాజరుకావాలని గ్రామస్తులు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు భైంసాలోని ఎమ్మెల్యే నివాసంలో ఆయనను కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు.
గ్రామంలో గత కొన్నేళ్లుగా కర్ర దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటు నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఏడాది కూడా ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని విజ్ఞప్తి చేశారు.










