బైంసా, సృష్టికర్త భగవాన్ విశ్వకర్మ భగవానుని జయంతిని గురువారం రోజు బైంసా పట్టణంలోని స్వర్ణకార సంఘ భవనంలో స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ భగవానుడు ఈ సృష్టికి మూలకర్త అని పలువురు అభివర్ణించారు.
కార్యక్రమ వివరాలు
ఈ సందర్భంగా విశ్వకర్మ భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం అధ్యక్షుడు బెజ్జంకి రవీంద్ర చారి, కార్యదర్శి రంగు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు విద్యాసాగర్, కోశాధికారి రాజు, బైంసా పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం కార్యదర్శి డాక్టర్ సాగర్, కోశాధికారులు సిహెచ్ అశోక్, రంగురవి, పండరి, బంతి మురళి, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.












