ఆలూరు, 15 September
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పై మరియు ఆయన రచించిన రాజ్యాంగంపై వివాదాస్పద, అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్ వైఖరిని నిరసిస్తూ మండల కేంద్రంలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. మాల మహానాడు ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది.
అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు,హమారా ప్రసాద్ దిష్టిబొమ్మ దహనం ఆర్మూర్,సెప్టెంబర్:15 భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పై మరియు ఆయన రచించిన రాజ్యాంగంపై వివాదాస్పద,అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్ వైఖరిని నిరసిస్తూ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.మాల మహానాడు మండల అధ్యక్షులు అగ్గు క్రాంతి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ...దేశమంతటా ఎంతోమందికి మార్గదర్శిగా నిలిచిన బాబాసాహెబ్ అంబేద్కర్‌ను,రాజ్యాంగాన్ని అవమానించేలా మాట్లాడటం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు.హమారా ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను అంబేద్కర్ సంఘాలు, మాల మహానాడు నాయకులు మరియు యువజన సంఘాల ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు.హమారా ప్రసాద్ తన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని,బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు.లేనిపక్షంలో నిరసనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.బహుజన నాయకులను,రాజ్యాంగాన్ని కించపరిచేలా వ్యవహరిస్తే దేశంలో ఎక్కడా తిరగనివ్వమని తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో పలు అంబేద్కర్ సంఘాల నాయకులు,మాల మహానాడు ప్రతినిధులు మరియు యువజన నాయకులు పాల్గొని హమారా ప్రసాద్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో హర్ష హరీష్,అయితే వెంకటేష్,సజన్,ప్రదీప్, వినయ్ భోజన్న ప్రణయ్, మల్లేష్, సురేష్, కిట్టు, తదితరులు పాల్గొన్నారు.












