సారంగాపూర్, 15 September
మండలంలోని ఆలూర్ గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సర్పంచ్ తెలిపారు. ఈ లక్ష్య సాధనకు గ్రామ ప్రజల సహకారం ఎంతో అవసరమని ఆయన కోరారు. ఈ సందర్భంగా తడి చెత్త, పొడి చెత్త వేరుచేయడానికి చెత్తబుట్టలను పంపిణీ చేశారు.
ఆలూర్ గ్రామంలో స్టీల్ బ్యాంకు ప్రారంభం... ప్లాస్టిక్ రహిత గ్రామం తమ లక్ష్యం సర్పంచ్... మన రంజని తెలుగు టైమ్స్ మండలంలో ఆలూర్ గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యం ఆలూర్ గ్రామ ప్రజల సహకారం దీనికి చాలాముఖ్యం దయచేసి అందరూ సహకరించాలని మనవి మరియు తడి చెత్త పొడి చెత్త కొరకు చెత్తబుట్టలని పంపిణీ చేయడం జరిగింది “మన ఇంటినుంచే చెత్తని వేరుచేసి మన గ్రామాని పరిశుభ్రంగా , ఆరోగ్యంగా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుందాం కార్యక్రమానికి ముఖ్యాతిదిగా వచ్చిన DPO మరియు కార్యక్రమంలో లో పాల్గొన్న MPDO, MPO, హెల్త్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ ఆఫీసర్ స్కూల్ ఉపాధ్యాయులు, సింగిల్ విండో చైర్మన్ మాణిక్ రెడ్డి, ఉపసర్పంచ్ అశోక్ నాయకులు ఈర్ల విజయ్ వార్డ్ సభ్యులు, విద్యార్థులు గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు












